ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సేవలు
● పోలీసులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ● ఎస్పీ మహేశ్ బి గీతే
ముస్తాబాద్(సిరిసిల్ల): పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలుగుతారని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. బుధవారం ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో శ్రీతిరుమల నర్సింగ్‌హోం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. రేయింబవళ్లు శాంతిభద్రతల కోసం పనిచేసే పోలీసులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారన్నారు. అలాంటి వారి కోసం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 34 రకాల వైద్య పరీక్షలు, గుండె పరీక్షలు నిర్వహించారు. సీఐ మొగిలి, ఎస్సై గ ణేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు చేరువగా పోలీసు విధులు
ఇల్లంతకుంట: ప్రజలకు చేరువగా పోలీసు విధులు ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు, పలు రికార్డులు, స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైం హాట్ స్పాట్స్ అడిగి తెలుసుకున్నారు. ప్రజల కు సత్వర న్యాయం, విజిబుల్ పోలిసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్,, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులను రివ్యూ చేసి ప లు సూచనలు చేశారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ మొగిలి, ఎస్సై అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల కేరీర్‌కు ఆరోగ్యమే ముఖ్యం
ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యార్థుల కేరీర్‌కు ఆరోగ్యం దోహదం చేస్తుందని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. ముస్తాబాద్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు.


