యూరియా ఏ‘దయా’
ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌లో యూరియా అందక అన్నదాతలు బుధవారం ఆందోళనకు దిగారు. రైతులు మాట్లాడుతూ వరినార్లు పోసుకొని నెలరోజులు గడుస్తున్నా యూరియా అందక నార్లు ముదిరిపోతున్నాయన్నారు. మూడు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా దొరకడం లేదన్నారు. అధికారులు స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. గత సీజన్‌లోనే యూరియా దొరక్క దిగుబడి పడిపోయిందని, ఇప్పుడు కూడా సమయానికి ఇవ్వకపోతే పరిస్థితి ఏందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద లింగాపురంలో లైన్..
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురంలో పీఏసీఎస్ ఎరువుల గోదాము ఎదుట యూరియా కోసం రైతులు లైన్‌లో బుధవారం వేచి ఉన్నారు. గోదాం ఇన్‌చార్జి రవి మాట్లాడుతూ ఇప్పటివరకు పెద్ద లింగాపురంలో మూడువేల యూరియా బస్తాలు పంపిణీ చేశామని, ఎలాంటి కొరతలేదని తెలిపారు.
–ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట
యూరియా ఏ‘దయా’


