వర్కర్ టూ ఓనర్ ప్రారంభించాలి
సిరిసిల్లటౌన్: నేత కార్మికులను యజమానులు చేయడానికి వర్కర్ టూ ఓనర్ పథకాన్ని సిరిసిల్లలో వెంటనే ప్రారంభించాలని తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ కోరారు. బుధవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి చీరలకు సంబంధించి 10శాతం యారన్ సబ్సిడీని పవర్‌లూమ్ కార్మికులతో పాటు వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు అందించాలన్నారు. కార్మికుల సమస్యల సాధన, సంక్షేమ పథకాల అమలుకై ఈనెల 9న బీవైనగర్‌లోని చేనేత శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తదితరులు పాల్గొన్నారు.


