ఫైర్ స్టేషన్ మంజూరు చేయండి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండలకేంద్రానికి ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అసెంబ్లీలో విన్నవించారు. ఫైర్ స్టేషన్లు ఉన్న కోరుట్ల, వేములవాడ పట్టణాలు రుద్రంగికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా పట్టణాల నుంచి ఫైరింజన్లు వచ్చేసరికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని కోరారు.
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకుడు, స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌శర్మ మృతి పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం సంతాపం తెలిపారు. రాజన్న ఆలయానికి భీమాశంకర్ అందించిన సేవలు మరువలేనివని, గతంలో తాము ఆలయాన్ని సందర్శించినప్పుడు దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన మరణం భక్తులకు, వేములవాడ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఫైర్ స్టేషన్ మంజూరు చేయండి


