కందేపికి ఆంధ్ర సారస్వత పురస్కారం
సిరిసిల్లటౌన్: పట్టణంలోని సృజన్ పిల్లల ఆసుపత్రి నిర్వహణకు గాను ఎండీ డాక్టర్ కందేపి రాణిప్రసాద్‌కు భాష సేవా పురస్కారం వరించింది. మంగళవారం గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు సభల్లో త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఆంధ్ర సారస్వత సేవా పురస్కారాన్ని అందుకున్నారు. కర్ణాటక రాష్ట్ర మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్, మహా సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ శాలువా, గోల్డ్‌మెడల్ అందించారు. రాణిప్రసాద్ పురస్కారం అందుకోవడం మన జిల్లాకు గర్వకారణమని రచయితలు పేర్కొన్నారు. తాము పాతికేళ్లుగా చేస్తున్న తెలుగు భాష కృషికి గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. మహాసభలలో అనేక మంది గవర్నర్లు, మారిషస్ దేశాధినేత, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.


