పారదర్శకంగా ఓటరు జాబితా
● సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్‌లు
సిరిసిల్లటౌన్/వేములవాడ: ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందిస్తున్నట్లు సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్‌లు ఎంఏ ఖాదీర్‌పాషా, అన్వేశ్ తెలిపారు. ఈమేరకు సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్ని రాజకీయ పార్టీలతో ఓటరు జాబితా పరిశీలన, సవరణలపై సమీక్షించారు. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తున్నట్లు తెలిపారు. జాబితాలో సవరణలు, తప్పొప్పులు ఉంటే సూచించాలని కోరారు. డబుల్ ఎంట్రీలు, మరణించిన వారి వివరాలు తెలియజేయాలన్నారు. ఈనెల 9 వరకు సవరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు సలహాలు, సూచనలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్, జిందం చక్రపాణి, దుమాల శ్రీకాంత్, వేములవాడ మేనేజర్ సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.


