హైదరాబాద్ తరలిన డీఆర్‌డీవో బృందం
సిరిసిల్ల: హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం శనివారం తరలివెళ్లింది. హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్‌తో జరిగే సమావేశానికి డీఆర్‌డీవో మచ్చ గీత, ఏపీడీ శ్రీనివాస్, జిల్లా అధికారుల బృందం ప్రత్యేక వాహనంలో వెళ్లారు. మహిళా సంఘాలను బలో పేతం చేయడం, పేదరిక నిర్మూలన పథకాన్ని సమర్థంగా నిర్వహించే లక్ష్యంతో సమావేశం జరిగింది.
దివ్యాంగుల పెళ్లికి రూ.లక్ష నజరాన
సిరిసిల్లకల్చరల్: దివ్యాంగుల జంటకు లక్ష నజరానా ఇవ్వనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం ప్రకటనలో తెలిపారు. ఇద్దరు దివ్యాంగులైనా, జంటలో ఒక్కరు దివ్యాంగులైనా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. 2005 మే 19 తరువాత జరిగిన ఈ తరహా వివాహాలను ప్రభుత్వం అందించే లక్ష ప్రోత్సాహకానికి అర్హులుగా పేర్కొన్నారు. www.epass.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా పెళ్లయిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకుని సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు కాపీ అందజేయాలని పేర్కొన్నారు.


