నిధులు లేవు.. పన్నులు సరిపోవు
గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామంలోని పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, సిబ్బంది జీతభత్యాలు, వీధిలైట్ల మరమ్మతులకే సరిపోవడం లేదు. పాత విద్యుత్ బకాయిలు చెల్లించడం తలకు మించిన భారమవుతుంది. ప్రభుత్వం కరెంట్ బిల్లుల కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి.
– ఎలగందుల నర్సింలు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్
బకాయిలు చెల్లించి.. సంస్థను కాపాడండి
జిల్లా వ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా సెస్‌కు బకాయిలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలోనైనా గ్రామపంచాయతీల నూతన పాలకవర్గాలు, వినియోగదారులు బకాయి విద్యుత్ బిల్లులు చెల్లించాలి. బిల్లులు చెల్లించినప్పుడే సెస్ మనుగడ సాధ్యమవుతుంది. బిల్లులు చెల్లించి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలి. – చిక్కాల రామారావు, సెస్ చైర్మన్
నిధులు లేవు.. పన్నులు సరిపోవు


