భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల/వేములవాడ: భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. భీమన్న ఆలయంలో స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లను ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ రుత్విక్‌సాయి, ఆర్డీవో రాధాభాయిలతో కలిసి పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సింహాచారి, ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు, ఏఈవో శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, ఎంవీఐ వంశీధర్, డీసీఎస్‌వో బి.చంద్రప్రకాశ్, ఏఎంవీఐలు రజనీదేవి, పృథ్వీరాజ్‌వర్మ పాల్గొన్నారు.


