రూ.3.10 కోట్లు తాగేశారు
సిరిసిల్లక్రైం: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 నాడు రూ.3.10కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు. ఎక్సైజ్ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒక్క రోజే 2,766 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 3,885 బీర్ కేసుల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ మొత్తం గణాంకాలను పరిశీలిస్తే 59,968 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 76,974 బీర్ కేసుల విక్రయాలు జరిగింది. డిసెంబర్ నెలలో రూ.67.14 కోట్ల మేర మద్యం వ్యాపారం జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.


