అర్హులకు ఇళ్లు కేటాయించాలి
సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడం దురదృష్టకరమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అన్నారు. మంగళవారం శాంతినగర్‌లోని డబుల్ బెడ్రూం ఇళ్లను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రజల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఇళ్లలోని ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామగ్రి దొంగలపాలవుతున్నాయన్నారు. ఈ ప్రాంతం అసాంఽఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని, అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు కొండ నరేశ్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నర్సయ్య, సురేశ్, శ్రీనివాస్, శ్రీధర్, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


