చేయి..చేయి కలిపారు.. అభివృద్ధి సాధించారు
● సుస్థిరాభివృద్ధిలో రాష్ట్రంలో పదో స్థానం ● బండపల్లిలో పుష్కలంగా తాగు, సాగునీరు ● ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధిలో ప్రగతి
చందుర్తి(వేములవాడ): వారంతా గ్రామీణులు.. ఐకమత్యంలో ఆదర్శప్రాయులు.. గ్రామంలో అమలయ్యే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. సామూహిక ఇంకుడుగుంతలు.. పారిశుధ్య నిర్వహణ.. ఆదర్శమైన తాగు, సాగునీటి నిర్వహణతో చందుర్తి మండలం బండపల్లి గ్రామం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి 2022–23 జాబితాలో రాష్ట్రంలోనే పదోస్థానంలో నిలిచింది. ఆ గ్రామం సాధించిన ప్రగతిపై ప్రత్యేక కథనం.
పల్లెసిగలో ప్రగతి విరులు
బండపల్లిలో వలసలు అరికట్టేందుకు ఉపాధిహామీ కూలీలకు ప్రణాళికాబద్ధంగా పనులు కల్పించారు. గ్రామపంచాయతీ పరిధిలోని మహిళలు, యువత జీవనోపాధికి చేపట్టిన కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పీహెచ్‌సీలో వసతులు కల్పించారు. తాగునీరు, సాగునీటి అవసరాలు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, సుపరిపాలన, సామాజిక భద్రతపై అధికారులు ఫోకస్ చేశారు. ఆయా అంశాల్లో గ్రామం సాధించిన ప్రగతిని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ గుర్తించింది. రాష్ట్రంలోని టాప్ 25 గ్రామాల్లో బండపల్లికి పదో స్థానం దక్కింది.
చేయి..చేయి కలిపారు.. అభివృద్ధి సాధించారు


