● మహిళా సంఘాలకు 191 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ● కలెక్టర
సిరిసిల్ల/ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో యాసంగిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం, నామాపూర్, పోతుగల్ గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాలకు 191 కొనుగోలు కేంద్రాలను అప్పగించినట్లు తెలిపారు. సహకార సంఘాలకు 42 కేంద్రాలు, మెప్మా ద్వారా 6, డీసీఎంఎస్‌కు ఒకటి మొత్తం 240 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వేసవి దృష్ట్యా చల్లని నీరు, చలువపందిళ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టామన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, డీఆర్‌డీవో శేషాద్రి, డీఎస్‌వో వసంతలక్ష్మి, మార్కెటింగ్ డీఎం రజిత, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో బీరయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ విజిలెన్స్ కమిటీ సభ్యులు కొమ్ము బాలయ్య, వైస్‌చైర్మన్ వెల్ముల రాంరెడ్డి పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు ఎరువులు, విత్తనాల షాపులు
జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఎరువులు–విత్తనాల షాప్‌ల ఏర్పాటుకు లైసెన్స్‌లు ఇవ్వాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ, డీఆర్‌డీవో అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా సంఘాలలో అర్హులైన వారిని గుర్తించాలన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సొంత గోడౌన్ ఉన్నా వారిని, అద్దెకు తీసుకున్న వారికి గోడౌన్, ఎరువులు, విత్తనాల లైసెన్స్ సర్టిఫికెట్ అందించాలని సూచించారు. డీఆర్‌డీఏ అధికారులు జిల్లాలోని అర్హులైన మహిళలను గుర్తించి ఆ వివరాలను వ్యవసాయశాఖ అధికారులకు అందించాలన్నారు. ప్రతీ మండలానికి రెండు చొప్పున మహిళా సంఘాల సభ్యులకు కేటాయించాలని, వచ్చే పంట కాలం కంటే ముందే లైసెన్స్‌లు జారీ చేయాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్‌డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్‌బేగం, అడిషనల్ డీఆర్‌డీవో గొట్టె శ్రీనివాస్, డీపీఎంలు సుధారాణి, పద్మయ్య పాల్గొన్నారు.
పోషకాహార లోపం లేకుండా చూడాలి
పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఐసీడీఎస్ అధికారులతో సమీక్షించారు. అంగన్‌వాడీ సిబ్బంది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల పరిశీలించాలని సూచించారు. బాలామృతం, కోడిగుడ్ల పంపిణీలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. 50 నూతన అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొంటాం


