వాతావరణం
వాతావరణం తేటగా ఉంటుంది. ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.
నేడు జిల్లాకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు బుధవారం జిల్లాకు వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకుని హనుమాన్ పూజ, భిక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గంభీరావుపేటలో పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు కోనరావుపేట మండలం మల్కపేటలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మొదటి వార్షికోత్సవంలో పాల్గొంటారు.
రజతోత్సవ సభను విజయవంతం చేయండి
గంభీరావుపేట: వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు కోరారు. గంభీరావుపేటలో మంగళవారం ప్రచార పోస్టర్‌లను ఆవిష్కరించారు. నాయకులు వెంకటస్వామిగౌడ్, వెంకటియాదవ్, గంధ్యాడపు రాజు, నగేశ్‌గౌడ్, మల్లేశం, బండ రమేశ్, రామానుజాగౌడ్, కిశోర్, దోసల శంకర్, లింగంయాదవ్, వహీద్ పాల్గొన్నారు.
10 నుంచి సమ్మెలోకి మున్సిపల్ కార్మికులు
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ
సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికులకు రావాల్సిన ఐదు నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10 నుంచి సమ్మె చేపడుతున్నట్లు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎస్.సమ్మయ్యకు మంగళ వారం సమ్మె నోటీస్ అందించి మాట్లాడారు. మున్సిపాలిటీ కార్మికులకు రావాల్సిన 5 నెలల పీఆర్సీ బకాయిలను వెంటనే అందించాలని కోరారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సుల్తాన్ నర్సయ్య, కార్యదర్శి కాసారపు శంకర్, బాబా కిషన్, వేణు, మల్లేశం, శ్రీనివాస్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
వాతావరణం
వాతావరణం


