కాంగ్రెస్‌తోనే సంక్షేమ పథకాలు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట(వేములవాడ): పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రారంభించినవేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని నిమ్మపల్లిలో సోమవారం చేపట్టిన ‘జైబాపు..జైభీమ్.. జైసంవిధాన్’లో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే ఉపాధిహామీ, గరీభీ హటావో, ఇందిరమ్మ ఇళ్లు, భూములేని నిరుపేదలకు పోడు భూములు, బ్యాంకుల జాతీయకరణ వంటి పథకాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ను అమలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రూ.500 సిలిండర్, గల్ఫ్‌లో మరణించిన కార్మికులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నామని వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం జైసేవాలాల్ ఊరుతండాలో సన్నబియ్యం లబ్ధిదారు ఇస్లావత్ మధుకర్ ఇంటిలో భోజనం చేశారు. మండల కన్వీనర్ గడ్డం నర్సయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, మానుక సత్యం, బైరగోని నందూగౌడ్, చేపూరి గంగాధర్, శ్రీనివాస్, బండి ప్రభాకర్, మాజీ సర్పంచ్ బండ సత్తయ్య, సదానందం, దేవరాజు పాల్గొన్నారు.


