గ్రూప్–1లో మెరిసిన జిల్లావాసులు
కరీంనగర్: టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో కరీంనగర్‌కు చెందిన కన్నం హరిణి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంక్ సాధించింది. ఎస్సీ కమ్యూనిటీలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించింది. కరీంనగర్ విద్యానగర్‌లో నివాసం ఉంటున్న కన్నం రమేశ్ రామడుగు మండలం వెలిచాల జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయుడు. భార్య కళాప్రపూర్ణ జ్యోతి రామడుగు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయురాలు. వీరిది సొంతూరు బోయినపల్లి మండలం అనంతపల్లి. వీరి కూతురు గ్రూప్–1 పరీక్ష రాయగా ఆదివారం వెలువడిన ఫలితాల్లో జోన్–1లో డిప్యూటీ కలెక్టర్ పోస్టు పొందేందుకు అర్హత సాధించింది. హరిణిని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీటీఎఫ్ నాయకులు కొమ్ము రమేశ్, మానుపాటి రాజన్న, చిలుక దేవశంకర్, బెజగం రమేశ్, మానుపాటి రాజయ్య, మేకల స్వరూప అభినందించారు.
ఎస్సీ కోటాలో హరిణికి మొదటి ర్యాంకు


