వాతావరణాన్ని కలుషితం చేసే కోనోకార్పస్ మొక్కలు రాష్ట్రంలో ఉన్నాయి. వాటితో అనేక జబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో కోనోకార్పస్ చెట్లు ఎక్కడ ఉన్నా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం.. అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం శాసన సభలో వ్యాఖ్యానించారు. స్పీకర్ మాటలను పరిశీలిస్తేనే అవి ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది.
సిరిసిల్ల: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో తెలియకుండానే విషవనాలను నాటేశారు. ఐదేళ్ల క్రితం మొక్కలుగా ఉన్న కోనో కార్పస్ నేడు వృక్షాలుగా మారాయి. పుప్పొడిని వెదజల్లుతూ మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ మొక్కలను ప్రపంచ దేశాలన్నీ ఏనాడో నిషేధించగా.. తెలంగాణలో 2022 జూ న్ 15న నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే అప్పటికే లక్షలాది మొక్కలు నాటగా.. అవి చెట్లుగా ఎదిగాయి. ప్రస్తుతం పూలు పూసి, కాయలు కాసి రోడ్లపైనే వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో ఆ మొక్కలను తొలగిస్తారా.. లేదా.. అనే మీమాంస కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విషవనాలపై ప్రత్యేక కథనం.
పర్యావరణానికి పెనుముప్పు
ఈ మొక్కలు కోనోకార్పస్ కంబ్రాటేసీ కుటుంబానికి చెందినవి. ఈ మొక్క ఎందుకూ పనికిరాదు. వీటి నీడలో పచ్చిగడ్డి కూడా పెరగదు. భూగర్భ జలాలను ఎక్కువగా తీసుకుంటుంది. ఈ చెట్ల వేర్లకు అడ్డువస్తే పైపులైన్లు, కేబుల్‌వైర్లను సైతం చీల్చుకుని వెళ్తాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపుగా పెరుగుతాయి. సముద్రతీర ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను పట్టణాల్లోకి తెచ్చి జనవాసాల్లో నాటుకున్నారు. ఫలితంగా జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించింది. కోనోకార్పస్ మొక్కల కాయల్లోని పుప్పుడి గాలిలో కలిసి ఆస్తమా, అలర్జీ లాంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ పల్లెలో కోనోకార్పస్ మొక్కలు
హరితహారంలో నాటిన అధికారులు
పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు
ప్రమాదకరమంటున్న వైద్యులు
అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలతో పీడ తొలగేనా ?
జనావాసాల్లో విషవనాలు
జనావాసాల్లో విషవనాలు
జనావాసాల్లో విషవనాలు


