
వేములవాడ: కేంద్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై లోక్‌సభలో ప్రశ్నిస్తున్నారని రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. వేములవాడలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తూనే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వెంకట స్వామి, రాకేశ్, శ్రీనివాస్, సంగ స్వామి, మ ధు, విష్ణు, రాము, తిరుపతి, గణేశ్, కృష్ణ, శంకర్, నరేశ్, శ్రీకాంత్, సురేశ్, ప్రకాశ్, ఎల్లయ్య, రాజేందర్, ప్రభాకర్, పర్శరాం పాల్గొన్నారు.
గ్రూప్–1కు ఉచిత శిక్షణ
సిరిసిల్లకల్చరల్: గ్రూప్–1 పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బీసీ స్టడీసర్కిల్‌లో ఈనెల 29 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో శిక్షణ తీసుకున్నవారు, మెయిన్స్‌కు అర్హత పొందిన వారు దరఖాస్తుకు అనర్హులని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ అందజేస్తామని తెలిపారు.