న్యూస్‌రీల్
అక్రమార్జనే పరమావధిగా టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. వాగులు, వంకలు, చెరువులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటికి ప్రధాన ఆధారమైన గుండ్లకమ్మ వాగును చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుకను ఇష్టారీతిగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. ఇసుక తవ్వకాలపై స్థానికులు సమాచారం ఇచ్చినా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఇంకా తవ్వకాలకు తెగబడుతున్నారు.


