ఇక ఆటవిడుపు | - | Sakshi
Sakshi News home page

ఇక ఆటవిడుపు

Mar 19 2026 7:35 AM | Updated on Mar 19 2026 7:35 AM

ఇక ఆటవిడుపు ● ముగిసిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు

● ముగిసిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు

ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 67 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జనరల్‌ విద్యార్థులు మొత్తం 15,476 మందికి గాను, 15,035 మంది హాజరుకాగా, 439 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ 6 పరీక్ష కేంద్రాలను, డీఈసీ 7 పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్‌ 33 కేంద్రాల చొప్పున మొత్తం 46 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. స్నేహితులకు వీడ్కోలు చెబుతూ సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సొంత ఊళ్లకు వెళ్లే విద్యార్థులతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది. సరిపడినన్ని బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement