చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ అక్రమం | - | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ అక్రమం

Jun 19 2025 7:46 AM | Updated on Jun 19 2025 7:46 AM

చెవిర

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ అక్రమం

కనిగిరి రూరల్‌: వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ అక్రమమని మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్‌కే అబ్దుల్‌ గఫార్‌, జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జీ ఆదినారాయణరెడ్డి, రైతు సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు పోలక సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక పార్టీ ఆఫీస్‌లో శ్రీసేవ్‌ డెమోక్రసీ–సేవ్‌ ఏపీశ్రీ వాల్‌ పోస్టర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. హామీల అమలు, సర్కార్‌ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై పోరాడతామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరసాని మోహన్‌రెడ్డి, సిరుప వెంకట గోవర్ధన్‌రెడ్డి, డాక్టర్‌ నాయబ్‌ రసూల్‌, డాక్టర్‌ ఆవుల కృష్ణారెడ్డి, ఎస్‌కే జిలానీ బాషా, ఎం.నాగమణి, ఎస్‌కే షకీలా, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, సంగటి మహేంద్రారెడ్డి, మితికల వెంకట్‌, శీలం శివారెడ్డి, చిలంకూరి కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదు

గిద్దలూరు రూరల్‌: తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్ట్‌లు చేస్తే వైఎస్సార్‌ సీపీ శ్రేణులు భయపడతాయనుకోవడం కూటమి నేతల భ్రమేనని గిద్దలూరు నగర అధ్యక్షుడు మానం బాలిరెడ్డి పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తూ స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. మానం బాలిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగానికి బదులు రెడ్‌ బుక్‌ కుట్రలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ సంబంధం లేని లిక్కర్‌ స్కామ్‌లో చెవిరెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇరికించడం రెడ్‌ బుక్‌ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. అనంతరం అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బండారి నోవెల్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాలుగుళ్ల సుబ్బారెడ్డి, నంద్యాల బాలుయాదవ్‌, కావేరి, వెంకటరావు, నాసరి శ్రీను, పోలేపల్లె శివ, పాలుగుళ్ల నరసింహారెడ్డి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి, గిద్దలూరులో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల నిరసన

కూటమి కక్ష సాధింపు చర్యలకు బెదిరేది లేదని ప్రతిన

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ అక్రమం 1
1/1

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ అక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement