స్వయం ప్రకాశం లేని నేత ‘చంద్ర’బాబు

YSRCP Vijayasai Reddy Comments On Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఒక్క ఎన్నికలోనూ సొంతంగా గెలిచిన చరిత్ర లేదు

అందరితో పాటు ఢిల్లీకి ఆయన్నూ ఆహ్వానించారు

ఆయన్ను ప్రధాని పలకరిస్తే మాకెందుకు ఆందోళన?

మోదీ, వైఎస్‌ జగన్‌ భోజనం చేస్తూ గంటపాటు మాట్లాడుకున్నారు

బాబులా ప్రచారం కోరుకోని నేత ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజల్లో స్వయంప్రకాశంలేని నాయకుడని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 1994లో వెన్నుపోటుతో అధికారం లాక్కుని, 1999లో కార్గిల్‌ యుద్ధం వల్ల.. 2014లో మోదీ గాలిలో అధికారంలోకి రావటం తప్పితే సొంతం గా ఒక్కసారి కూడా గెలిచింది లేదని ఎద్దేవా చేశారు. పలు అంశాలపై ఆయన సోషల్‌ మీడియా వేదికగా మంగళవారం తీవ్రంగా స్పందించారు. నీతి ఆయోగ్‌ సమావేశం డిన్నర్‌ విందులో ప్రధానితో పాటు ముగ్గురు సీఎంలు, ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు పాల్గొన్నారని తెలిపారు. ఆ ముగ్గురు సీఎంలలో వైఎస్‌ జగన్‌ ఒకరని చెప్పారు.

అక్కడ గంటకు పైగా ఒకే టేబుల్‌ వద్ద ప్రధానితో మాట్లాడినప్పటికీ.. ప్రచారం కోరుకోని సీఎం జగన్‌ స్థాయి ఎక్కడ? నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు ఐదుగంటలకు సరిపడా కట్టుకథ అల్లిన బాబు, ఆయన పచ్చమీడియా స్థాయి ఎక్కడ? అని ప్రశ్నించారు. ఇలాంటి వారిని పరాన్న జీవులు అంటారన్నారు. ఢిల్లీలో అన్ని పార్టీల ఇళ్లలో తిని, అందరి ఇళ్ల వాసాలు లెక్కపెట్టిన చంద్రబాబు అనే ద్రోహిని ఎవరైనా మళ్లీకలుద్దాం.. మా ఇంటి కి రండి.. అని ఎందుకు పిలుస్తారన్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశానికి ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఆహ్వానం అందలేదని, దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను కూడా ఆ హ్వానించారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధా ని కొద్దినిమిషాలు చంద్రబాబుతో ముచ్చటించ డం టీడీపీ అనుకూల మీడియాకు పెద్ద వార్త యిందన్నారు. మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ప్రధాని అన్నారని చంద్ర బాబు చెప్పిన మాటలు ఆయన అనుకూల పత్రి కలు, చానళ్లు.. గొప్ప సానుకూల పరిణామంగా చెప్పుకున్నాయని అన్నారు. ఇంతటితో ఆగక.. వైఎస్సార్‌సీపీ దిగులు పడుతోందన్నట్టు కథనా లు వండివార్చడం విడ్డూరమని, ఆందోళన చెం దాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top