రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ | YSRCP President YS Jagan To Meet With Party Local Body Leaders | Sakshi
Sakshi News home page

రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

Apr 1 2025 4:42 PM | Updated on Apr 1 2025 5:00 PM

YSRCP President YS Jagan To Meet With Party Local Body Leaders

తాడేపల్లి : రాష్ట్రంలోఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో  పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీ విజయానికి సహకరించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను వైఎస్ జగన్ స్వయంగా కలవనున్నారు. వీరితో రేపు(బుధవారం) ప్రత్యేకంగా సమావేశమై.. వారిందరికీ అభినందనలు తెలపనున్నారు వైఎస్ జగన్. 

టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.   బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్‌ సభ్యులు హాజరవుతారు.  

ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలు చర్చించడంతో పాటు, భవిష్యత్‌ కార్యాచరణపైనా సమావేశంలో పార్టీ అ«ధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ‍్మల్ని చూసి గర్వపడుతున్నా’

 

Advertisement
 
Advertisement
Advertisement