టీడీపీ నేతలు చర్చకు రాకుండా పారిపోయారు: ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు

YSRCP MLA Meka Pratap Apparao Slams On TDP Leaders Nuzvid - Sakshi

సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలోని నూజివీడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ నేత ముద్రబోయిన సవాల్‌ను ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు స్వీకరించారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. సవాల్‌ ప్రకారం.. ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు నూజివీడుకు వచ్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నూజివీడు అభివృద్ధిపై చర్చకు సిద్ధమని తెలిపారు. టీడీపీ నేతలు చర్చకు రాకుండా పారిపోయారని మండిపడ్డారు. నూజివీడు నియోజకవర్గానికి టీడీపీ చేసిందేమీలేదని అన్నారు.

వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని ముద్రబోయిన మమ్మల్ని విమర్శిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top