‘ఇంతకీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు?.. టీడీపీనా.. బీజేపీనా..’

YSRCP Leader KK Raju Challenges Former MLA Vishnukumar Raju - Sakshi

మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు కేకే రాజు సవాల్‌

సాక్షి, విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీచేయబోతున్నారు..? ఇంతకీ మీది టీడీపీనా..? బీజేపీనా..? ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై వైఎస్సార్‌ సీపీ ఉత్తర సమన్వయర్త, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడే మైక్‌ బీజేపీది.. మాట టీడీపీదని... అలాగే మాట్లాడే ఆఫీస్‌ బీజేపీది.. అజెండా టీడీపీదని ఎద్దేవా చేశారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో కేకే రాజు మాట్లాడారు.
చదవండి: సబ్బం హరి ఆస్తులు సీజ్‌!

నా జెండా.. అజెండా వైఎస్సార్‌ సీపీనే అని... ఊపిరున్నంత వరకు సీఎం వైఎస్‌ జగనన్న వెంటేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సీటుపై, రాజకీయ భవిష్యత్‌పై బెంగలేదన్నారు. విష్ణుకుమార్‌ రాజుకు మాత్రం రాజకీయ భవిష్యత్‌పై బెంగ ఉంటే వైఎస్సార్‌ సీపీలో కార్యకర్తలా చేర్చుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉంటూ చంద్రబాబు, లోకేష్‌పై ప్రేమ ఒలకపోస్తూ జ్యోతిష్యుడి అవతారం ఎత్తుతున్నారని మండిపడ్డారు.

తాను ఎమ్మెల్యే సీటు కోసం రాజకీయాల్లోకి రాలేదని, సీఎం వైఎస్‌ జగన్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఊపిరున్నంత వరకూ జగనన్న వెంటే నిలుస్తానని సంపత్‌ వినాయక ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. 2024 ఎన్నికల్లో మీరు ఏ పార్టీ నుంచి పోటీచేస్తారో సంపత్‌ వినాయక ఆలయంలో ప్రమాణం చేస్తారా...? అని విష్ణుకుమార్‌ రాజుకు సవాల్‌ విసిరారు. అసలు నోట్ల రద్దు, కరెన్సీ ముద్రణ అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు. 22 ఏ భూములపై నిర్లక్ష్యం వహిస్తున్నామంటున్నారని... అయితే గతంలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడే చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. 

రాజకీయంగా ఎదుర్కొలేకనే దుష్ప్ర చారం 
రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణిపై టీడీపీ, బీజేపీ నాయకులు దు్రష్పచారం చేస్తున్నారని కేకే రాజు అన్నారు. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్‌ స్కాం జరిగితే భారతమ్మపై దు్రష్పచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు.  నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు.  సమావేశంలో డిప్యూటీ మేయర్‌ కె.సతీ‹Ù, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి, జీవీఎంసీ ఫ్లోర్‌లీడర్‌ బాణాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top