మోసాల బడ్జెట్‌.. బాహుబలి అంటూ బిల్డప్‌లు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Press Meet Speech Highlights On March 5th 2025 In Telugu, Watch Full Video Inside | Sakshi
Sakshi News home page

మోసాల బడ్జెట్‌.. బాహుబలి అంటూ బిల్డప్‌లు: వైఎస్‌ జగన్‌

Mar 5 2025 11:00 AM | Updated on Mar 5 2025 3:13 PM

YS Jagan Press Meet Highlights March 5th 2025 News

గుంటూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్‌ గారడీతో అది బయటపడిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబు చేస్తున్న దగాను వివరించారు.

ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 👉అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. సూపర్‌ సిక్స్‌, 143 హామీల కోసం అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోంది.

👉బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు. ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు.  20 లక్షల ఉద్యోగాలు,. రూ.3 వేల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. 

👉ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు. రెండు బడ్జెట్‌లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు . గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. 

👉ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్‌ ప్రసంగం ఉంది. తొలిబడ్జెట్‌లో కేటాయిచింది బోడి సున్నా. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగి భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్‌ సర్వేలో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్‌లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?

👉జగన్‌ చెప్పినదానికంటే ఎక్కువ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి

👉చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధం.. మోసం. చంద్రబాబు చేసేది.. దగా .. వంచన

👉వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సెక్టార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు. మొత్తం మా పాలనలో అన్నీ రంగాలకు కలిపి 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలిచ్చాం. ఆధార్‌ కార్డులతో సహా ఆ వివరాలు చెప్పగలం. ఇది ఎవరూ కాదనలేని సత్యాలివి

👉18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. 

👉స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్‌లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్‌ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు. 

👉అఫ్‌కోర్స్‌.. చంద్రబాబుకి రైతులను మోసం చేయడం కొత్తేం కాదు రైతు భరోసా పేరిట రైతన్నలను గతంలోనే కాదు.. ఇప్పుడూ మోసం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల సాయం అందిస్తామన్నారు. కిందటి ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఆ పని చేస్తే.. రెండు బడ్జెట్‌లకు కలిపి రూ.40 వేలు ఎగనామం పెట్టినట్లు అవుతుంది. 

👉 దీపం పథకం కింద మరో మోసానికి దిగారు. ఎలాగూ ఎగనామం పెట్టేదే కదా..  మోసమే కదా అని కేటాయింపులు చేసుకుంటూ పోయారు.

👉 చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం..  50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్‌ల విషయంలో మరో 20 లక్షల మంది జత కావాల్సి ఉంది. రెండేళ్లలో రూ.96 వేల చొప్పున మోసం చేశారు. 

👉 సూపర్‌ సిక్స్‌.. సెవెన్‌ కింద అన్ని పథకాలకు కలిపి మొత్తం.. దాదాపు రూ.80 వేల కోట్లు(రూ.79,867 కోట్లు) కావాలి. కిందటి ఏడాది రూ.7 వేల కోట్లు పెడితే.. రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈసారి బడ్జెట్‌ కేటాయింపులే రూ.17, 179 కోట్లు మాత్రమే. బాబు షూరిటీ.. మోగ్యారెంటీకి ఇదే నిదర్శనం.   

👉వైఎస్సార్‌సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు అన్నారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇలా.. బహిరంగంగా మాట్లాడతారా?. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?..  ఇలాంటి సీఎం  ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటిక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా?. 

చంద్రబాబు చేసిన ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ అందరూ చూడాలి

ఎన్నికల టైంలో చంద్రబాబు:  జగన్‌ ఇప్పించిన సంక్షేమం ఆగదు.  143 హామీలు కాకుండా.. మరింత సంక్షేమం ఇస్తాం

అసెంబ్లీలో సీఎంగా చంద్రబాబు: మనం హామీలు ఇచ్చాం. సూపర్‌ సిక్స్‌ ఇచ్చాం. చూస్తే భయం వేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం  ఆలోచించాలి.

👉సంక్షేమానికి కేరాఫ్‌గా నిలిచాం. మా హయాంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి 17 మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చాం. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. విద్యారంగంలో కీలక సంస్కరణలు తెచ్చాం. CBSE నుంచి IB వరకు బాటలు వేశాం. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది

👉మా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్‌లు అందించాం. బాబు పాలనలో 62 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నారు. కొత్తగా ఎవరిని చేర్చకపోగా.. ఉన్నవాళ్లలో 4 లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ పెన్షన్‌ నిధులు తగ్గించేశారు

👉రూ.15 వేలు ఇస్తామని వాహనమిత్రకు ఎగనామం పెట్టారు. ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారు. 

👉దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలెండర్‌ అమలు చేశాం. మా హయాంలో అక్కాచెల్లెళ్లకు భరోసా ఉండేది. తమ కాళ్లపై నిలబడేలా అడుగులు ముందుకు వేశాం. 

👉ఇప్పుడు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి పథకాలు లేవు. విద్యాదీవెన పథకానికి నిధులు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేయనుంది. మార్చి 12న విద్యార్థులు, తల్లిదండ్రుల సమన్వయంతో వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు ఉంటుంది

👉కూటమి ప్రభుత్వంలో.. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రంగాలను నాశనం చేశారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. మేం తెచ్చిన విప్లవాత్మక మార్పులను.. నిర్వీర్యం చేశారు. మిర్చి రైతులను దారుణంగా మోసం చేశారు. సమస్య పరిష్కరించామని అసెంబ్లీలో అబద్ధాలు చెబున్నారను. కేజీ మిర్చి కూడా కొనలేదు.

👉ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. కోవిడ్‌లాంటి మహమ్మారి టైంలోనూ మెరుగైన జీతాలు.. అదీ సకాలంలో మేం చెల్లించాం. ఇవాళ జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్లను  ఎగ్గొట్టారు. ఐఆర్‌, పీఆర్‌సీ, పెండింగ్‌బకాయిలు ఇవన్నీ ఇవ్వబోమని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.

👉అయ్యా.. పయ్యావులగారూ.. కరోనా టైంలోనూ సాకులు చెప్పకుండా మేం అన్నీ సక్రమంగా నడిపించాం. ఇప్పుడు మీరు ఎగ్గొటడానికి సాకులు వెతుకుతున్నారు.

అప్పులపై.. తప్పులు

👉2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే..  2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్‌ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్‌ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. 

👉సాధారణంగా.. బడ్జెట్‌ గ్లాన్స్‌లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ,  లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్‌లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.

👉ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు.  

👉రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. అయ్యా స్వామీ.. ఏంది ఈ మోసాలు?.. బడ్జెట్‌ అంతా అంకెల గారడీ.. దీనిని పట్టుకుని బాహుబలి బడ్జెట్‌ అనడం వాళ్లకు మాత్రమే చెల్లుతుంది

👉ఇదీ వాస్తవం. ఇబ్బడిముబ్బిడిగా అప్పు. గత మా ప్రభుత్వంలో కన్నా, ఇప్పుడు ఇబ్బడిముబ్బిడిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. మా హయాంలో 2023–24లో మేము రూ.62,207 కోట్లు చేస్తే, చంద్రబాబు 2024–25లో చేసిన అప్పు రూ,73,362 కోట్లు. నిజానికి అది ఇంకా ఎక్కువే ఉంది. ఇంకా అమరావతి కోసం చేసిన, చేస్తున్న అప్పులు వేరుగా ఉన్నాయి.
ఇబ్బడిముబ్బిడిగా అప్పులు చేస్తున్నారు. మాట్లాడితే, అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ మోడల్‌ అంటాడు. కానీ, బడ్జెట్‌లోని డిమాండ్, గ్రాంట్స్‌ చూస్తే.. రూ.6 వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసమని చూపారు. మరి అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ మోడల్‌ అని ఎందుకు చెప్పాలి?

👉రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌): 2023–24తో 2024–25ను పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం ఏకంగా 9.5 శాతం పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్‌ఓఆర్‌ 2023–24లో రూ.93,084 కోట్ల నుంచి రూ.1,01,985 కోట్లకు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, కాగ్‌ నివేదిక చూస్తే.. ఎస్‌ఓఆర్‌ తగ్గింది. 2025–26లో 37 శాతం పెరుగుదలతో రూ.1,27 లక్షల కోట్లకు ఎస్‌ఓఆర్‌ చేరుతాయంటున్నారు. ఇది మరో పచ్చి అబద్ధం. నిజానికి రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. కేవలం చంద్రబాబు, ఆయన మనుషులకే ఆదాయం వస్తోంది. ఖజానాకు సున్నా.

👉నాన్‌ టాక్స్‌ రెవెన్యూ: 2024–25లో మిస్‌లీనియస్‌ జనరల్‌ సర్వీసెస్‌ కింద రూ.7,916 కోట్లు ఆదాయం చూపుతున్నారు. ల్యాండ్‌ రెవెన్యూ కింద రివైజ్డ్‌ అంచనా మేరకు రూ.1341 కోట్లు అని చూపుతున్నారు. కానీ, నిజానికి ఈ 10 నెలల్లో వచ్చింది కేవలం రూ.196 కోట్లు మాత్రమే. మరి ఏ రకంగా ఆ ఆదాయం పొందబోతున్నారు?

👉మూల ధన వ్యయం: 2023–24లో 10 నెలల్లో మూలధన వ్యయం కింద మేము రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే, అదే చంద్రబాబు హయాంలో 2024–25లో తొలి 10 నెలల్లో చేసిన వ్యయం కేవలం రూ.10,854 కోట్లు అంటే మైనస్‌ 48 శాతం. ఇది వాస్తవం. కానీ రివైజ్డ్‌ అంచనాలో మరో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు.

👉ఈ బడ్జెట్‌ అంకెల గారడీ కాదా?: చంద్రబాబు వచ్చాక ఆదాయం తగ్గింది. రాష్ట్ర సొంత ఆదాయం ఎస్‌ఓఆర్‌ పెరగలేదు. అది పెరగకపోగా, చాలా తగ్గింది. మూల ధన వ్యయం కూడా దారుణంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితులున్నా, చంద్రబాబు ఏమంటున్నాడు. జీఎస్‌డీపీ 12.94 శాతం నమోదు అవుతుందని చెబుతున్నాడు. ఎలా సాధ్యం?. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ ఏడాది బడ్జెట్‌ రూ.3,22,359 కోట్లు ఎలా సాధ్యం? ఇది అంకెల గారడీ కాదా?. పైగా దీన్ని బాహుభళీ బడ్జెట్‌ అనడం మీకే చెల్లింది.
 

👉ప్రతిపక్షం ఈ మేర చెప్పలేకపోతే.. ఎలా?. ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం

👉ఇంత ప్రసంగంలోనూ నేను ఎవరినీ తిట్టలేదు. లెక్కలతో సహా చూపించాం. మరి సమాధానాలు చెబుతారా? చూద్దాం

👉ఎమ్మెల్సీ ఫలితాలపై..

ఎమ్మెల్సీ విజయంతో ప్రజల్లో తమకు సానుకూలత ఉందన్న కూటమి ప్రభుత్వ వాదనపై జగన్‌ స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఫలితాల్లో రిగ్గింగ్‌ చేసేవాళ్లను ఎక్కడా చూడలేదు. ఫస్ట్‌ టైం ఇక్కడే చూశా. అయినా ఉత్తరాంధ్ర స్థానంలో టీచర్లు కూటమికి బాగా బుద్ధి చెప్పారు. అక్కడ రిగ్గింగ్‌ కుదరదు కాబట్టి ఓడిపోయారు

👉అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి.. ఒకటి అధికారం.. మరొకటి ప్రతిపక్షం . ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు కాకుంటే ఇంకెవరికి ఇస్తారు? . రెండు వైపులా మీరే కొడతామంటే.. ఇదేమైనా డబుల్‌ యాక్షన్‌ సినిమానా?

👉గతంలో టీడీపీ నుంచి ఐదుగురు మా వైపు వచ్చారు. మరో పది మందిని లాగుదామంటే నేనే వద్దన్నా.. ఏం మాట్లాడతావో మాట్లాడు.. నేను వింటా అని చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చా. ఇదే ఆయనకు నాకు తేడా

👉మైక్‌ ఇస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది ఇవట్లేదు కాబట్టే ఇలా మీడియా ముందుకు రావాల్సి వస్తోంది

పవన్‌పై సెటైర్లు..
👉టీడీపీ తర్వాత జనసేన అతిపెద్ద పార్టీ అని.. కాబట్టి తాము ఉండగా ఈ ఐదేళ్లు వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారని మీడియా ప్రతినిధులు జగన్‌ వద్ద ప్రస్తావించారు. పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవిత కాలంలో ఒక్కసారి ఆయన ఎ‍మ్మెల్యే అయ్యారు అని జగన్‌ సెటైర్‌ వేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement