అక్కచెల్లెమ్మలకు మరో మోసం | YS Jagan Fires On Chandrababu Govt Over Zero interest subsidy to Womens | Sakshi
Sakshi News home page

అక్కచెల్లెమ్మలకు మరో మోసం

Jun 26 2026 6:06 AM | Updated on Jun 26 2026 6:06 AM

YS Jagan Fires On Chandrababu Govt Over Zero interest subsidy to Womens

రెండేళ్లుగా సున్నా వడ్డీ రాయితీ ‘సున్నా’ 

చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు 

ఆ హామీని తుంగలో తొక్కి.. 2024–25లో వడ్డీ లేని రుణాలకు కేటాయింపులు సున్నా 

2025–26లో రూ.వంద కోట్లు కేటాయించినా విడుదల చేసింది సున్నా 

2026–27లో కేటాయింపులు రూ.వంద కోట్లు.. ఇప్పటి దాకా విడుదల చేసింది సున్నా 

ఒక్కో సంఘానికి రూ.6 లక్షలు రుణం ఉందనుకుంటే ఏటా వడ్డీ రాయితీ రూ.3 వేల కోట్లు ఇవ్వాలి 

ఈ లెక్కన రెండేళ్లలో వడ్డీ లేని రుణాల కింద ఎగ్గొట్టిన రాయితీ రూ.6 వేల కోట్లు 

మా హయాంలో సున్నా వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం.. ఆసరా, చేయూత కింద ఆర్థిక సహాయం అందించి అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచాం 

2020–21లో వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.16,505 కోట్ల నుంచి 2023–24 నాటికి ఏకంగా రూ.49,626 కోట్లకు పెరిగిన రుణాలు 

బాబు రెండేళ్ల పాలనలో రూ.49,626 కోట్ల నుంచి రూ.41,105 కోట్లకు తగ్గిన వైనం  

సాక్షి, అమరావతి: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన సర్కార్‌ తుంగలో తొక్కి.. అక్కచెల్లెమ్మకు మరో మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌హెచ్‌జీలకు రుణాలు ఇవ్వడం అత్యంత కీలకమని, మహిళలకు రుణాలు ఇస్తే.. స్వయం ఉపాధి, చిన్న చిన్న వ్యాపారాలు, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. రుణాలు తగ్గించడం, వడ్డీ రాయితీ ఇవ్వక పోవడం వల్ల పెట్టుబడులు తగ్గాయని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయం తగ్గడమే అందుకు నిదర్శనమని ఎత్తిచూపారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ–జనసేన కూటమి ఇచ్చిన హామీలు.. వడ్డీ లేని రుణాలకు బడ్జెట్‌లో కేటాయించినా నిధులు ఇవ్వకపోవడం.. మహిళలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతుండటాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ.. ఎస్‌ఎల్‌బీసీ, బడ్జెట్‌ ప్రతులు, ఎన్నికల మేనిఫెస్టోను జత చేస్తూ గురువా రం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..  

ఇది ఆర్థిక సంక్షోభాన్ని తెలియజేస్తోంది 
‘‘స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) రుణా­లు ఇవ్వడం అత్యంత కీలకం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటిది. మహిళలకు ఇచ్చే రుణాలు పెరిగితే ఉత్పాదకత పెట్టుబడులు పెరుగుతాయి. ఇది ఎస్‌హెచ్‌జీల ఆదాయాన్ని పెంచే సామర్థ్యాన్ని బలోపేతం చేసి, వాటి ఆర్థిక సుస్థిరతకు దోహద పడుతుంది. మహిళలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతే పెట్టుబడులు తగ్గి.. తద్వారా ఆదాయాలు తగ్గి.. ఫలితంగా వినియోగం కూడా తగ్గడాన్ని సూచిస్తుంది. ఇది ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడి వృద్ధి 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక సంక్షోభానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్‌హెచ్‌జీలకు రుణాల వృద్ధిని ప్రోత్సహించడానికి ఆ రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వడం అత్యంత కీలకం. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం వడ్డీ రాయితీ ద్వారానే ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.4,969 కోట్లు ప్రత్యక్ష మద్దతు అందించింది. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘ఆసరా’, ‘చేయూత’ వంటి కార్యక్రమాల ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి అపారమైన మద్దతును అందించింది. ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచుతామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో హామీ ఇచ్చాయి.   

చంద్రబాబు పాలనలో గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ కింద ఏటా రూ.100 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌లో చెప్పినా, తుదకు ఇచ్చింది సున్నానే   , పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కింద ఈ రెండేళ్లలో ఏమీ ఇవ్వని చంద్రబాబు సర్కారు   

ఎగ్గొట్టిన వడ్డీ రాయితీ రూ.6,000 కోట్లు 
ఎప్పటిలాగే అధికారం చేపట్టిన తర్వాత, టీడీపీ కూటమి ఇచ్చిన హామీని విస్మరించి అక్కచెల్లెమ్మలను మోసం చేసింది. పెంచిన రుణ పరిమితిపై వడ్డీ రాయితీ ఇవ్వడం పక్కనపెడితే.. ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ కార్యక్రమానికి కూడా ఎలాంటి నిధులు విడుదల చేయకుండా దాన్ని నిర్వీర్యం చేశారు. 2024–25లో వడ్డీ రాయితీ కింద విడుదల చేసిన మొత్తం ‘సున్నా’. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించినా, విడుదల చేసింది మాత్రం ‘సున్నా’. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో మళ్లీ రూ.100 కోట్లు కేటాయించినా, ఇప్పటికి విడుదల చేసింది ‘సున్నా’నే. ప్రతి స్వయం సహాయక బృందానికి రూ.6,00,000 అప్పు ఉందని భావించినా.. టీడీపీ హామీకి అనుగుణంగా వడ్డీ రాయితీ మొత్తం రూ.3,000 కోట్లు అవుతుంది. అంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ రాయితీ కింద ఎగ్గొట్టిన మొత్తం రూ..6,000 కోట్లు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2019–24 మధ్య ఎస్‌హెచ్‌జీలకు రుణ వృద్ధి గణనీయంగా పెరిగింది. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం మద్దతు ఇవ్వక పోవడం వల్ల రుణ వృద్ధి తగ్గిపోతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలకు రూ.49,626 కోట్ల రుణాలు ఇస్తే.. అవి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.41,623 కోట్లకు తగ్గాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.41,105 కోట్లకు పడిపోయాయి.   

2020లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రూ.16,505 కోట్ల నుంచి 2024లో ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.49,626 కోట్లకు పెరిగిన స్వయం సహాయక సంఘాల రుణాలు.. ఈ రెండేళ్ల చంద్రబాబు పాలనలో రూ.41,105 కోట్లకు తగ్గిన రుణాలు  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement