Yellow Media Fake News On AP BJP Core Committee Meeting - Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియాపై ఏపీ బీజేపీ సీరియస్‌.. చర్యలకు సిద్ధం!

Published Sun, Nov 13 2022 11:44 AM

Yellow Media Fake News On AP BJP Core Committee Meeting - Sakshi

సాక్షి, అమరావతి: ఎల్లో మీడియా కథనాలపై ఏపీ బీజేపీ సీరియస్‌ అయ్యింది. బీజేపీ కోర్‌ కమిటీ భేటీపై తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోము వీర్రాజుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఎల్లోమీడియా వక్రీకరించింది. 

అయితే, సోమువీర్రాజు తనలాగే 40 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రధాని వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించింది. ఎల్లోమీడియా కథనాలను బీజేపీ నేతలు ఖండించారు. కాగా, టీడీపీ అనుకూల మీడియా తప్పుడు వార్తలపై చర్యలకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక, కోర్‌ కమిటీ భేటీలో చంద్రబాబుతో అంటకాగిన నేతల ప్రచారంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మరోవైపు, ఈ భేటీలో ఇద్దరు ఎంపీలు.. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ బలహీనపడిందని అన్నారు. దీనిపై చర్చ నడిచింది. బాబుకి ఏజ్‌ లేదు.. లోకేష్‌కు సామర్థ్యం లేదని ఎంపీలు చెప్పారు. చంద్రబాబుపై నెగటివ్‌ కామెంట్స్‌ ఎల్లో మీడియా ప్రచురించలేదు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు సభలకు వాడుకున్న వైనంపై ప్రధాని మోదీ వద్ద చర్చించారు. ఆ అంశాన్ని చంద్రబాబు కోవర్టు బీజేపీ నేతలు మీడియాలో రాయించలేదు. ఇక, సోము వీర్రాజు నిర్వహించిన జనపోరు యాత్రను మోదీ అభినందించారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement