‘బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’ | Bandi Sanjay Sensational Comments On Alliance With BRS During Vijaya Sankalpa Yatra, Details Inside - Sakshi
Sakshi News home page

‘బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి’

Published Tue, Feb 20 2024 2:49 PM

Vijaya Sankalpa Yatra: Bandi Sanjay Sensational Comments - Sakshi

సాక్షి, వికారాబాద్‌ జిల్లా: బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అంటే.. చెప్పుతో కొట్టడంటూ.. బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రి బీఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు?. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేదు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోంది. బీజేపీకి రాముడున్నాడు…మోదీ ఉన్నాడు,.కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రాక్షసులున్నారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ ఇద్దాం. బతికున్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. హిందుత్వం మాట్లాడలేని నాడు రాజకీయాల నుండి తప్పుకుంటా’’ అంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: హస్తినలో సీఎం రేవంత్‌

Advertisement
Advertisement