
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాష్ట్రాన్ని రాక్షసుడిలా పట్టి పీడిస్తున్నాడని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా 40 ఆలయాలు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగేసి, దేవాలయాల్లో తాంత్రిక పూజలు చేయించిన చంద్రబాబును క్షమించమని దేవాలయానికి వస్తారా లేక శిక్షించమని వస్తారా అని మంత్రి టీడీపీ శ్రేణులను నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే..
► టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వార్తలను మత పెద్దలు, స్వామిజీలు నమ్మొద్దు. 2017 అక్టోబర్ 19న పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కె.పెంటపాడు గ్రామంలో శ్రీ గోపాలస్వామి ఆలయంలో రథం దగ్థం ఘటనకు బాధ్యత వహిస్తూ.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రాజీనామా చేస్తారా?
► అప్పట్లో దీనిపై ఎందుకు విచారణ చేపట్టలేదు? బాధ్యులను టీడీపీ, బీజేపీ, జనసేన ఎందుకు గుర్తించలేదు.
► దేవాలయాల్లో రాజకీయ జెండాలు కన్పించినా, నిరసనలు చేసినా.. వచ్చిన భక్తులకు, అర్చకులకు ఇబ్బంది కల్గించినా కఠినమైన చర్యలు తీసుకుంటాం.