‘హైదరాబాద్‌.. ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుంది’

Vellampalli Srinivas Attended Kanipakam Temple ON Vinayaka Chavithi - Sakshi

సాక్షి, చిత్తూరు : కాణిపాకం ఆలయంలో శనివారం వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి.తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ‌అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కారణమని, ఆయన మంత్రి పదవి ఇవ్వడం వల్లే ఈ అదృష్టం దక్కిందన్నారు. కాణిపాకం గుడిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. (‘చంద్రబాబు డైరెక్షన్‌‌లో రఘురామ కృష్ణంరాజు’)

సెప్టెంబర్ 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని గుడిల అభివృద్దే తమ లక్ష్యమని తెలదిపారు. కాణిపాకానికి మాస్టర్‌ ప్లాన్‌ దృష్టిలో ఉందని, దానిని త్వరలోనే అమలు చేస్తామన్నారు. వినాయక చవితి ఉత్సవాల గురించి ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన చంద్రబాబు డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారని, వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో చంద్రబాబు, రఘురామ కృష్ణమ రాజులు కాణిపాకానికి వచ్చి చూడాలని సవాలు విసిరారు. చంద్రబాబు హైదరాబాద్, రఘురామ కృష్ణమ రాజులు ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. (ఏపీ: జిల్లాల పునర్విభజనపై కీలక ఆదేశాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top