చిన్నా పెద్దా తేడా లేదు.. అందర్నీ కలుపుకొనిపోతాం

సాక్షి, నల్లగొండ: మును గోడు ఉపఎన్నికలో చిన్నా పెద్దాఅనే తేడా లేకుండా కార్యకర్తలు, నాయకులను కలుపుకొనిముందుకు పోతామని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.
తనను మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడులో సమావేశాలకు పిలవడం లేదంటూ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. మంత్రి పైవిధంగా సమాధానం చెప్పారు. సమాచార లోపాలను సరిచేసుకుంటామని, నర్సయ్యగౌడ్‌ను కూడా కలుపుకొని ముందుకుపోతామని చెప్పారు.
చదవండి: మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్!