బాలకృష్ణ పర్యటన.. హిందూపురంలో ఉద్రిక్తత | Tension In Hindupur During Balakrishna Visit | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ పర్యటన.. హిందూపురంలో ఉద్రిక్తత

May 4 2025 2:21 PM | Updated on May 4 2025 2:56 PM

Tension In Hindupur During Balakrishna Visit

సాక్షి, సత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.

వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు పొందిన పార్టీ కార్యకర్తలు సన్మానం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హిందూపురం రహమత్ పూర్ సర్కిల్‌లో వైఎస్సార్ అమర్ రహే స్థూపాన్ని అధికారులు, టీడీపీ కార్యకర్తలు కలిసి తొలగించారు. అక్కడ బాలకృష్ణ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. దీంతో, వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అనంతరం, హిందూపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి.. రహమత్‌ పూర్‌ సర్కిల్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement