దమ్ముంటే నన్ను సస్పెండ్‌ చేయండి

Telangana: Ponguleti Ponguleti Srinivas Reddy Challenges Brs Party - Sakshi

బీఆర్‌ఎస్‌ నేతలకు ‘పొంగులేటి’సవాల్‌

ఏ  పార్టీలో చేరినా నా వాళ్లకు టికెట్‌ గ్యారంటీ

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సోమవారం దమ్మపేట మండలం నెమలిపేటలో జరిగిన అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల ఆతీ్మయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘నా మద్దతుదారులను సస్పెండ్‌ చేస్తున్నారు. ఈరోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను. దమ్ము, ఖలేజా ఉంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయండి’అంటూ సభావేదిక నుంచి సవాల్‌ చేశారు.

‘‘పొంగులేటికి బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం ఉందా?’అని అడు గుతున్న నేతలు గత డిసెంబర్‌ వరకు పార్టీ స భలు, సమావేశాలకు నాకు ఎందుకు ఆహ్వా నం పంపారు? ఫ్లెక్సీల్లో నా ఫొటోలు ఎందు కు ఉపయోగించారు? ఎన్నికలప్పుడు నా సా యం ఎందుకు కోరారు’అని శ్రీనివాస్‌రెడ్డి ప్ర శ్నించారు. ‘ఏ పారీ్టలో చేరినా ఇప్పుడు నేను ప్రకటించిన అభ్యర్థులే, ఆ పార్టీ గుర్తుపై ఎన్నికల బరిలో ఉంటారు. అలా చేయగలిగే ద మ్ము, ధైర్యం నాకు ఉంది’అని పేర్కొన్నారు.

ఎవరో ఇబ్బంది పెట్టారని, మరెవరో పిలుస్తున్నారని తొందరపడి పార్టీ మారే ఉద్దేశం తన కు లేదని స్పష్టం చేశారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి త మ బృందం అభ్యర్థి జారె ఆదినారాయణ ఉంటారని తెలిపారు. కాగా, పొంగులేటి ఆతీ్మయసభలకు వెళ్లొద్దని హెచ్చరికగా ఆదివారం పలువురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా సోమ వారంనాటి సమావేశానికి జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్యతోపాటు నలభై మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మండల, జి ల్లాస్థాయి నేతలు హాజరుకావడం గమనార్హం. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top