ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. నేడు హైకోర్టులో విచారణ | Telangana High Court Hearing On BRS MLAs Disqualification Petition | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. నేడు హైకోర్టులో విచారణ

Jul 8 2024 11:02 AM | Updated on Jul 8 2024 12:28 PM

Telangana High Court Hearing On BRS MLAs Disqualification Petition

సాక్షి, హైదరాబాద్‌ : బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో హుజురాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఆ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి పిటిషన్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement