వైఎస్సార్‌ సీపీలో చేరిన చలమలశెట్టి సునీల్

TDP Leader Chalamalasetty Sunil Joins In YSRCP - Sakshi

సాక్షి, అమరావతి : సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేత చలమలశెట్టి సునీల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న అభీష్టాన్ని వెల్లడించారు. జగన్‌కు ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, జ్యోతుల చంటిబాబు, పెద్దాపురం పార్టీ సమన్వయకర్త దవులూరి దొరబాబు పాల్గొన్నారు.

కాగా ముఖ్యమంత్రి జగన్‌తో తనకు తొలి నుంచీ మంచి అనుబంధం ఉందని చలమలశెట్టి సునీల్‌ అన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ చిన్న సమస్య వల్ల కొంత కాలం దూరంగా ఉన్నానని, ఇకపై జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని స్పష్టం చేశారు. సునీల్‌ను తామంతా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top