60వేల మందితో రాహుల్‌కు స్వాగతం 

Sangareddy MLA Jagga Reddy About Rahul Gandhi Bharat Jodo Yatra - Sakshi

సంగారెడ్డి ఎమ్మెల్యే  జగ్గారెడ్డి  

కొండాపూర్‌(సంగారెడ్డి): నవంబర్‌ 3న సంగారెడ్డిలో ప్రారంభమయ్యే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు 60వేల మందితో స్వాగతం పలుకు తామని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం మల్కాపూర్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెహ్రూ ప్రధాని అయ్యాక రాంచంద్రాపూర్‌లో బీహెచ్‌ఈఎల్, ఇందిరా గాంధీ మెదక్‌ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యాక బీడీఎల్, ఓడీఎఫ్‌ వంటి పరిశ్రమలు, సోనియాగాంధీ హయాంలో సంగారెడ్డిలో ఐఐఐటీ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో 25 కి.మీ మేర రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగతుందని, యాత్రను విజయవంతం చేయాలని కోరారు. మండలాల అధ్యక్షులు ప్రభు, బుచ్చిరాములు, రాంరెడ్డి, ప్రకాష్‌ చెర్యాల ఆంజనేయులు, ప్రభుదాసు, రఘు గౌడ్, వెంకటేశం గౌడ్, సునీల్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top