విద్యుత్ చార్జీల పెంపు మీ అసమర్థ పాలనకు నిదర్శనమా: రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams CM KCR Over Hike Bus Fare, Electricity Charges - Sakshi

సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌ చార్జీల పెంపు టీఆర్‌ఎస్‌ అసమర్థ పాలనకు నిదర్శనమా అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగి తక్కువ ధరలకు విద్యుత్ లభిస్తున్న తరుణంలో చార్జీలు తగ్గించాల్సింది పోయి భారం మోపుతారా అని మండిపడ్డారు.పెట్రో ఉత్పత్తులపై వేసే పన్ను ఆర్టీసీ వెన్ను విరిచిన విషయం వాస్తవం కాదా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.ఘిది మీ పతనమైన పాలనా వ్యవస్థల దుష్పలితామా అని నిలదీశారు. ఈ మేరకు విద్యుత్ చార్జీల పెంపు, ఆర్టీసీ నష్టాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ట్వీట్ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top