RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ! | Raghu Rama Krishnam Raju Enjoying Chandrababu's Political Slap | Sakshi
Sakshi News home page

RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!

Mar 25 2024 12:48 PM | Updated on May 12 2024 1:58 PM

Raghu Rama Krishnam Raju Enjoying Chandrababu's Political Slap - Sakshi

ఓ.. జమానాల సినిమా, అందులో మోహన్ బాబుది ఓ ఆకు రౌడీ రోల్‌.  ‘నాకు సీఎం తెలుసు.. గవర్నర్ తెలుసు’ అని తన అసిస్టెంట్తో ఓ బడాయిలకు పోతుంటాడు. ఎంతైనా పాత సినిమా కదా.. దానికి తగ్గట్లే క్లైమాక్స్‌లో పోలీసులు వస్తారు. ‘అయ్యా.. మీకు సీఎం, గవర్నర్ తెలుసు కదా ఫోన్ చేయండి ఈ పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు’’ అని అసిస్టెంట్  గుర్తు చేస్తాడు. ‘నాకు వాళ్లు తెలుసుకానీ, వాళ్లకే నేను తెలియదు కదా’ అని చెప్పి పోలీస్‌ జీప్‌ ఎక్కుతాడు మోహన్‌బాబు. కట్ చేస్తే.. నరసాపురం సీటు విషయంలో RRR అదే రఘురామ కృష్ణంరాజు చేసిన హడావిడి ఆ పాత సినిమా సీన్లను సరిగ్గా మ్యాచ్‌ చేసిందనే చెప్పాలి. 

‘‘నరసాపురం సీటు నాదే .. నా బ్యాక్ గ్రౌండ్ మీకు తెలియదు. నాకు  వాళ్ళు తెలుసు.. వీళ్ళు తెలుసు’’ అంటూ ఫొటోలకు ఫోజులు పెట్టి మరీ మీసాలు తిప్పుకున్న రఘురామరాజుకు.. చివరకు చేతులు పిసుక్కోవడమే మిగిలింది.  చంద్రబాబు ప్రోద్బలంతో, టీడీపీ అనుకూల మీడియా సాయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శిస్తూ రచ్చబండ పేరుతో నాలుగేళ్లుగా నానా రాద్ధాంతం చేసినా రఘురామకు అచ్చీరాలేదు. ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో నరసాపురం సీటు గల్లంతైపోయింది.

మొదటి నుంచి బిల్డప్‌ బాబాయే.. 
స్వతహాగా తాను అందరి లాంటి వాడిని కాదనే భావనలో కూరుకుపోయిన రఘురామ.. ఆ పరిస్థితులతో వైఎస్సార్‌సీపీలో ఎంతకాలం కొనసాగలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి ఎంపీగా నెగ్గిన ఆయన.. ఏడాదిలోనే అనూహ్యంగా పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత తనకు ఢిల్లీ పెద్దల అండ ఉందని ప్రొజెక్టు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే..  అనర్హత వేటు పడకుండా ఐదేళ్ల పాటు లోక్‌సభలో ఎలాగోలా మేనేజ్‌ చేసుకోగలిగారు.

ఇక.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఢిల్లీలో నిత్యం ప్రెస్‌మీట్లు పెడుతూ.. ఏపీ ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా సీఎం జగన్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. మధ్య మధ్యలో చంద్రబాబు సూచనలతో కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేశారు.  టీడీపీని బీజేపీకి దగ్గర చేసి, 2024 తాను బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. ప్చ్‌.. ఇంతా చేస్తే చివరకు ఆపరేషన్ సక్సెస్‌, పేషెంట్‌ డెడ్‌ అన్నట్లు అయ్యింది RRR పరిస్థితి. 

అదే తిప్పి కొట్టింది మరీ.. 
ఈ నాలుగేళ్లుగా టీడీపీ కోసం రఘురామ చేయని పనంటూ లేదు. అదే సమయంలో.. బీజేపీ నీడలో ఉన్న తనపై వేటు కూడా వేయలేదంటూ వైఎస్సార్‌సీపీకి సవాల్‌ విసిరే స్టేజ్‌కు చేరుకున్నారు రఘురామ. అయితే.. తాను బాగా దగ్గర అని రఘురామ ఊహించుకుంటే.. బీజేపీ మాత్రం ఆయన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. పైగా చంద్రబాబు మనిషి అనే కోణంలో ఎంత దూరం ఉంచాలో.. అంత దూరం పెట్టాలని నిర్ణయించుకుంది. వీటికి తోడు ఏపీ సీనియర్లు రఘురామ మీద ఇచ్చిన నివేదికల్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. అందుకే నిర్మోహమాటంగా..  టిక్కెట్ కుదరదని తేల్చేసింది. 

నీ మెంబర్‌షిప్‌ ఏదయ్యా?.. 

ఏ పార్టీ అయినా సరే.. తమదాంట్లో ప్రాథమిక సభ్యత్వం లేకుండా టికెట్‌ ఇస్తుందా?. బిల్డప్పుల రఘురామకు ఆ మాత్రం సోయి లేదా?.. ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై  రఘురామకృష్ణంరాజు అక్కసు వెళ్లగక్కారు. అయితే దీనిపై ఏపీ బీజేపీ రఘురామ గాలి తీసేసింది. ‘‘బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో  ఆర్ ఆర్ ఆర్ పేరు లేకపోవడం ఆశ్చర్యమేముంది అంటూ ఎక్స్ వేదికగా బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా పోస్ట్ వేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా? అంటూ సెటైర్లు వేశారాయన. ‘‘వారిపై జాలిచూపే పార్టీలు(టీడీపీ, జనసేలను ఉద్దేశిస్తూ పరోక్షంగా) ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారాయన. 

 


రఘురామకు తగిన శాస్తి జరిగిందంటూ కొందరు నెటిజన్ల కామెంట్లు
 

‘నాకు టికెట్ రాకుండా సోము వీర్రాజు ద్వారా జగన్ అడ్డుకున్నాడు’.. 
ఎంపీ రఘురామ కృష్ణంరాజు
బాబోయ్‌.. కితకితలు  పెట్టకుండానే రాజుగారు భలే నవ్విస్తున్నారే!. సోము వీర్రాజు MP టికెట్‌కే దిక్కు లేదు.. నీకు టికెట్ రాకుండా  అడ్డుకోగలిగాడా?.. మింగలేక మంగళవారం మాటలు. సోము వీర్రాజు (కాపు) కు MP టికెట్ రాకుండా  చక్రం తిప్పింది పురంధేశ్వరి. ఎందుకంటే సోము కు ఎంపీ టికెట్ వచ్చి గెలిస్తే ..  కాపు కోటాలో కేంద్ర  మంత్రి అవుతాడు. నాకు రాదు అని ‘కమ్మ’ని కుట్ర పన్నింది 

 

‘3 అడుగులు వెనక్కి వేస్తున్నాను’ 
.. టికెట్ రాకపోవడం పై  రఘురామ రాజు. 
30 అడుగులు వెనక్కి వేసినా పీకే_లేదు
.. ఓ నెటిజన్‌ కామెంట్‌


నీ అతి చేష్టలు , నీవు ఏ మాత్రం నమ్మదగినవాడివి కావు అని అన్ని పార్టీలకు తెలుసు. నీవు నరసాపురం మొఖం చూడక ఐదేళ్లు. నీవు ఏ పార్టీ తరపున పోటీ చేసినా ఓడిపోతావ్ అని అన్ని పార్టీలకు తెలుసు. అందుకే కా కమ్మ  మీడియా  ఈనాడు  జ్యోతి TV5  నిన్ను వాడుకున్నాయి. కానీ నీవేమో నేను పెద్ద తోపు కాబోలు అనుకున్నావ్ 


ఆక్ పాక్ కరివేపాక్ క్లబ్బులో .. శాశ్వత  సభ్యునిగా నీకు మెంబెర్ షిప్ ఇచ్చాడు చంద్రబాబు

రఘురామరాజుకు టికెట్ ఇవ్వని టీడీపీ. నర్సాపురం బీజేపీ సీటు వర్మకు ఇచ్చారు. 
కానీ బీజేపీ టికెట్ ఇవ్వలేదని పడి ఏడుస్తోంది టీడీపీ అను కుల భజన మీడియా ఈనాడు జ్యోతి TV5. 


2014లో కూడా టీడీపీ టికెట్ ఇవ్వలేదు రఘురామరాజు
2019 లో వైఎస్సార్‌సీపీ టికెట్ మీద ఎంపీగా గెలిచినా పని చేసింది మాత్రం టీడీపీ కోసం
బాబు కళ్ళలో ఆనందం కోసం.. నిత్యం రెడ్లను తిడుతూ  కమ్మోళ్లను పొగుడుతూ గడిపాడు 5  ఏళ్ళు 
ఇప్పుడు సమ్మగా కమ్మ గ ఉందంట.. బాగా తీరింది దూల


అంతన్నాడు ఇంతన్నాడే  గంగరాజు.. 
ముంతమామామిడి పండన్నాడే  గంగరాజు..
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ...
నర్సాపురారం సీటు నాదే  అని  బాబు పవన్ ల ముందు ప్రకటించుకున్నాడు బిల్డప్ రాజు

 

అయినా తగ్గడంట!
అదేం చిత్రమో.. కోరుకున్న టికెట్‌ దక్కకున్నా.. రఘురామ రాజు ‘బేస్‌’లో వాయిస్‌ మాత్రం తగ్గలేదు. ఏమున్నా ప్రజల్లో తేల్చుకుంటానంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ రఘురామ ప్రకటించడాన్ని విడ్డూరంగా భావించాల్సిందే. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా.. పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించడంపై RRR ఒక వీడియో విడుదల చేశారు. కాలే కట్టేతో లోలోపల రగిలిపోతూనే.. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని సంతోషంగా లేనంటూ డబుల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో.. తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా విజయం సాధించారంటూ సీఎం జగన్‌పై నెపం నెట్టే యత్నమూ చేశారు. బీజేపీ నేత సోము వీర్రాజు ద్వారా సీఎం జగన్‌ తనకు టికెట్ రాకుండా అడ్డుకోగలిగారనేది రఘురామ రాజు ప్రధాన ఆరోపణ. ప్రతి ఒక్కరికీ ప్రతిసారీ విజయం దక్కదని వ్యాఖ్యానించిన రఘురామ.. బీజేపీ అధిష్టానం కూడా అది గుర్తించే టికెట్‌ వేరే వాళ్లకు ఇచ్చిందేమో!. అయితే ఇంత మాట్లాడి.. ఆఖరికి చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం పర్చడం ఇంతకాలం సాగిన కుట్రను మరింత బలపర్చిందని ఏపీ ప్రజలు గుర్తించరంటారా?.. 

:::సాక్షి వెబ్‌ పొలిటికల్‌ డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement