బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం మాకు మాటల్లేని ఆనందం: పేర్ని నాని

Perni Nani Key Comments On Construction Of Bandaru Port - Sakshi

సాక్షి, కృష్ణా: బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం మాకు మాటల్లేని ఆనందం. పోర్టు కోసం 19ఏళ్ల నుంచి ప్రభుత్వాల వెంటపడ్డాం. పోర్టు ప్రైవేటు చేతికి వెళ్తే ఎన్నటికీ పూర్తికాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. అందుకే బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తోందని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. 

కాగా, పేర్ని నాని ఆదివారం బందరులో మీడియాతో మాట్లాడుతూ.. మహానేత వైఎస్‌ఆర్‌ మరణంతో బందరు పోర్టు నిర్మాణం ఆగిపోయింది. ఈ భూమి ఉన్నంత వరకు బందరు పోర్టు ప్రజలు ఆస్తి. పోర్టు నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేయలేదు. వందకు వంద శాతం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగుతోంది. బందరు పోర్టు నిర్మాణంతో జిల్లా ముఖచిత్రం మారబోతోంది. 

నిన్నటి వరకు కలగా ఉన్న పోర్టు నిర్మాణం ఈరోజు సాక్షాత్కారం కానుంది. వంద శాతం ఈ క్రెడిట్‌ సీఎం జగన్‌కే దక్కుతుంది. తండ్రి సంకల్పాన్ని తనయుడు నెరవేరుస్తున్నాడు. పోర్టు నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం దక్కడం నా అదృష్టం​. గతంలో అనేకసార్లు బందరు రావాలని సీఎం జగన్‌కు కోరాను. గత ప్రభుత్వం లాగా మనం మోసం చేయవద్దని సీఎం జగన్‌ చెప్పారు. పోర్టు పనుల ప్రారంభోత్సవానికే బందరు వస్తానన్నారు. 

ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై పేర్ని నాని సెటైరికల్‌ పంచ్‌లు వేశారు. సెల్ఫీ డ్రామాలాడే కమల్‌హాసన్‌, గుమ్మడి, రేలంగిలను చూడలేకపోతున్నాం. చంద్రబాబు ఆయన ముఠా.. పోర్ట్‌, మెడికల్‌ కాలేజీ, ఫిషింగ్‌ హార్బర్‌ కట్టాలని ఏనాడైనా ఆలోచేన చేశారా?. మాటలు చెప్పేవారికి .. పనులు చేసే వారికి ఇదే తేడా అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: చల్లని కబురు.. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top