నడ్డా రిమోట్‌ ఎక్కడుంది: ఖర్గే

My remote control is with someone else but what about Nadda - Sakshi

బెల్గావీ (కర్నాటక): ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన రిమోట్‌ కంట్రోల్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం మండిపడ్డారు. ‘‘నా రిమోట్‌ వేరెవరి దగ్గరో ఉందని మోదీ అంటున్నారు. సరే, ఒప్పుకుంటా.

అయితే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రిమోట్‌ కంట్రోల్‌ ఎవరి దగ్గరుందో కూడా ఆయనే చెబితే బాగుంటుంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘బీజేపీ దమ్మూ ధైర్యం లేని పార్టీ. మీ లోపాల గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మాపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పితే బెదురుతామనుకుంటే అది మీ భ్రమ’’ అన్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top