ఈ ఉద్రిక్తతకు కారణం మీరే.. కాదు మీరే!

Munugode: BJP And TRS Leaders Blame Themselves On Palivela Incident - Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ-టీఆర్‌ఎస్‌ శ్రేణులు రణరంగం సృష్టించాయి. మునుగోడు మండలం పలివెలలో ఇరు పార్టీ శ్రేణులు కర్రలతో దాడులు చేసుకుని పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, తాజా ఘటనపై ఇరు పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. తప్పంతా టీఆర్‌ఎస్‌దేనని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీనే రెచ్చగొట్టిందని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది.

బీజేపీ కార్యకర్తలే రెచ్చగొట్లాని చూశారని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఈ తరహా రెచ్చగొట్టే చర్యలకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు దూరంగా ఉండి ఎన్నికలపైనే దృష్టిపెట్టాలని సూచించారు. మరొవైపు మంత్రి హరీష్‌రావు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఓటమి భయంతోనే బీజేపీ దాడులు చేస్తుందన్న హరీష్‌రావు.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు.

బీజేపీకి అబద్ధాలు చెప్పడం అలవాటేనని, ఆ పార్టీ కార్యకర్తలే తమపై దాడి చేశారని టీఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకునే దాడికి తెరలేపిందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందుకే తమ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తుందని ఆమె ఆరోపించారు.  ఓటమి భయం కారణంగానే టీఆర్‌ఎస్‌ దాడులు చేసిందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించగా,  తమ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చాలా సౌమ్యుడని, ఆయనపైనే టీఆర్‌ఎస్‌ దాడులు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు.

ఇది  కూడా చదవండి: ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల ఘర్షణ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top