టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై విజయసాయిరెడ్డి ట్వీట్ | Mp Vijayasai Reddy Tweet On Alliance Between Tdp Janasena And Bjp | Sakshi
Sakshi News home page

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై విజయసాయిరెడ్డి ట్వీట్

Mar 8 2024 11:52 AM | Updated on Mar 8 2024 1:18 PM

Mp Vijayasai Reddy Tweet On Alliance Between Tdp Janasena And Bjp - Sakshi

 టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు

సాక్షి, తాడేపల్లి: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు. ఈ 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది. సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్సార్‌సీపీకే ఓటు వేయండి’’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కాగా, బీజేపీతో పొత్తు బేరసారాలకు అమిత్ షా ఇంటి చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబు పొత్తు "రాజీ"కీయం కొనసాగుతోంది. స్పెషల్ స్టేటస్‌ను గాలికొదిలేసిన బాబు.. సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ రాజీపడ్డారు. 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలికారు.

కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement