త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

Monsoon Session of Parliament likely from July 19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు  వర్షాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. జూలై 19 న ప్రారంభమై ఆగస్టు 13 తో ముగియనున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ సెషన్‌ జరగనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫారసు చేసింది. ఈ సందర్భంగా  పార్లమెంటు  ఆవరణలో  కోవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్‌లు  పాటిస్తారు. అలాగే  సభ్యులంతా  కనీసం ఒక మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని భావిస్తున్నారు. సాధారణంగా పార్లమెంటు  మాన్‌సూన్‌  సెషన్‌ జూలై మూడవ వారంలో ప్రారంభమవుతుంది. ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ముగుస్తుంది.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top