‘మోదీ చాయ్‌’కి పెరిగిన డిమాండ్‌! | Modi Chai Amid Elections Huge Crowd Gathering | Sakshi
Sakshi News home page

Modi Chai: ‘మోదీ చాయ్‌’కి పెరిగిన డిమాండ్‌!

Apr 10 2024 11:22 AM | Updated on Apr 10 2024 1:02 PM

Modi Chai Amid Elections Huge Crowd Gathering - Sakshi

లోక్‌సభ ఎన్నికలకు రోజులు సమీపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ‘మోదీ చాయ్’ వార్తల్లో నిలిచింది. 

బీహార్‌లోని లాహెరియాసరాయ్‌లోని లోహియా చౌక్‌లో రాకేష్ రంజన్ అనే యువకుడు  ఇటీవలే ఒక టీ దుకాణాన్ని తెరిచాడు. దానికి ‘మోదీ టీ’ అని పేరు పెట్టాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ దుకాణంలో ‘మోదీ టీ’ని రుచి చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఇక్కడికి టీ తాగేందుకు వచ్చేవారు వివిధ రాజకీయ అంశాలపై బహిరంగంగా చర్చించుకోవడం పరిపాటిగా మారింది. 

ఈ టీ దుకాణం బ్యానర్‌పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించారు. దీనికి ఆకర్షతులైనవారంతా ‘మోదీ టీ’ తాగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ టీ తాగుతూ, మోదీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ప్రధానిని ప్రసంశలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు ఈ దుకాణంలో టీ విక్రయాలు పెరగడంతో దాని యజమాని రాకేష్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement