‘వారు స్వామివారికి పంగనామాలు పెట్టారు’ | MLC Iqbal Criticizes Chandrababu, Lokesh In Anantapur | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు, లోకేష్ స్వామివారికి పంగనామాలు పెట్టారు’

Sep 26 2020 6:37 PM | Updated on Sep 26 2020 8:22 PM

MLC Iqbal Criticizes Chandrababu, Lokesh In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : తిరుమల వెంకటేశ్వరస్వామికి తిరునామంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిక్లరేషన్‌ ఇచ్చారని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అన్నారు. శనివారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ స్వామివారికి పంగనామాలు పెట్టారని విమర్శించారు. వెంకటేశ్వరస్వామికి చెందిన సదావర్తి భూములను తక్కువ ధరకు కొట్టేయాలని చూశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతకరణ శుద్ది తో పాలిస్తున్నారని పేర్కొన్నారు. కొడాలి నాని రాజకీయ ఉన్మాదాన్ని మాత్రమే ప్రశ్నించారని తెలిపిన ఎమ్మెల్సీ ఏపీలో ఆలయాల ధ్వంసం వెనుక కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ ద్వారా అన్ని నిజాలు వెలుగుచూస్తాయని తెలిపారు. (చంద్రబాబుకు బొత్స సూటి ప్రశ్నలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement