​​​​​​​ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే ఆర్కే | MLA Alla Ramakrishna Reddy Comments On Opposition And Mangalagiri Ticket, Details Inside - Sakshi
Sakshi News home page

​​​​​​​MLA Alla Ramakrishna Reddy: ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా

Feb 20 2024 3:14 PM | Updated on Feb 20 2024 4:12 PM

Mla Alla Ramakrishna Reddy Comments On Opposition - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్‌ ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలవాలన్నారు. మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ గెలుపునకు తాను పనిచేస్తానన్నారు. పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు.

‘‘2019లో ఓసీ చేతిలో నారా లోకేష్‌ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్‌ ఓడిపోతారు. సీఎం జగన్‌ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు. ఏ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా​’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement