లోకేష్‌ యువ గళం కాదు.. టీడీపీకి సర్వ మంగళం: మంత్రి రోజా

Minister RK Roja Comments On Nara Lokesh Padayatra - Sakshi

సాక్షి, తిరుపతి: లోకేష్‌ యువ గళం కాదు.. టీడీపీకి సర్వ మంగళం అంటూ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ పాదయాత్రపై స్పందించారు. పాదయాత్ర మొదటిరోజే లోకేష్‌కు రియాలిటీ తెలుస్తుందన్నారు.

‘టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్‌ తాపత్రయం. జనసేన పార్టీ.. కన్ఫూజన్‌ పార్టీ’ అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.‘‘కావాలనే పచ్చ మీడియా లోకేష్‌ పాదయాత్రకు చాలా హైప్ ఇస్తున్నాయి. దశ దిశ లేకుండ ప్రజలకు ఏం చేశారో చెప్పలేని వాళ్లు పాదయాత్రలో ఏం చెప్తారు. ప్రజా సమస్యలపై సీఎం జగన్‌ పోరాటం చేసి పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చి 99 శాతం హామీలు అమలు చేశారు’’ అని మంత్రి అన్నారు. ఏఎన్‌ఆర్‌పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని, ఎన్టీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలకృష్ణ ఆలోచించాలి’’ అని మంత్రి రోజా అన్నారు.

చదవండి: ప్రభుత్వంపై కుళ్లుతో రామోజీ తప్పుడు రాతలు: మంత్రి సురేష్‌

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top