కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్‌.. క్షమాపణలు చెప్పాల్సిందే.. | Minister Komatireddy Venkat Reddy Serious Comments On KCR Over Nalgonda Visit And Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్‌.. క్షమాపణలు చెప్పాల్సిందే..

Feb 11 2024 11:54 AM | Updated on Feb 11 2024 1:46 PM

Minister Komatireddy Venkat Reddy Serious On KCR - Sakshi

సాక్షి, నల్లగొండ: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేతపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ నల్లగొండ జిల్లాలోకి రావాలంటే ముందుగా ముక్కు నేలకు రాసి రావాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లాను బీఆర్‌ఎస్‌ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, మంత్రి కోమటిరెడ్డి ఆదివారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు. ఇక్కడ కుర్చీ వేసుకుని ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పాడు. బీఆర్‌ఎస్‌ నల్లగొండను నాశనం చేసింది. త్వరలో ఇక్కడికి కేసీఆర్‌ వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్‌ మళ్లీ వస్తున్నారు. కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి. బీఆర్‌ఎస్‌ సభ రోజున ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్‌ ప్రసంగించాలి. కేసీఆర్‌ మాట తప్పడంపై జిల్లా కేంద్రంలో వినూత్న నిరసన చేపడుతున్నాం. కేసీఆర్‌ కోసం కుర్చీ, పింక్‌ టవల్‌, ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

అలాగే, రాష్ట్ర బడ్జెట్‌పై కూడా కోమటిరెడ్డి స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైంది. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలి. కేఆర్‌ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టింది కేసీఆర్‌, హరీష్‌రావే అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement