బస్సు యాత్రతో ప్రజలకు మరింత చేరువ: మంత్రి బొత్స | Minister Botsa Satyanarayana Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

YSRCP Bus Yatra: బస్సు యాత్రతో ప్రజలకు మరింత చేరువ: మంత్రి బొత్స

Oct 22 2023 10:46 AM | Updated on Oct 22 2023 12:22 PM

Minister Botsa Satyanarayana Comments On Pawan Kalyan - Sakshi

ప్రజలకు జరిగిన మేలును వివరించడమే బస్సు యాత్ర ఉద్దేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు జరిగిన మేలును వివరించడమే బస్సు యాత్ర ఉద్దేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సామాజిక సాధికార బస్సు యాత్రతో ప్రజలకు మరింత చేరువవుతామన్నారు. సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్‌ మాత్రమేనని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాం. జరిగిన అభివృద్ధిని 175 నియోజకవర్గాల  ప్రజలకు వివరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

‘‘సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం. మద్యం ధరలు పెంచేశాం అంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ బెల్టుషాపులు లేకుండా నియంత్రించాం. మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లి ఓట్లు అడిగే దుమ్ము టీడీపీకి ఉందా?. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మాది’’ అని మంత్రి స్పష్టం చేశారు.

పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవకూడదా?
పవన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఏ అంశంపైనా సరిగా స్టడీ చేయకుండా విమర్శలు చేస్తున్నారు. పవన్‌ తెలుసుకుని మాట్లాడితే మంచిది. బైజూస్‌ ద్వారా విద్యార్థులకు ఉచితంగా కంటెంట్‌ అందిస్తున్నాం. పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవకూడదా?. మీ పిల్లలే ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవాలా?. మన విద్యార్థులందరూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నదే మా లక్ష్యం. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్‌ రావాలన్నదే మా డిమాండ్‌. సీఎం జగన​ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రైల్వే జోన్‌ గురించి అడుగుతున్నారు’’ అని మంత్రి బొత్స వివరించారు.

మేలును వివరిస్తాం: వైవీ సుబ్బారెడ్డి
నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారని  వైఎఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభిస్తున్నామని, ఈ యాత్రలో ప్రతీ  ఒక్కరికీ జరిగిన మేలును వివరిస్తామన్నారు. దళితులకు, గిరిజనులకు సీఎం జగన్‌ చేసిన మేలు గతంలో ఎవ్వరూ చేయలేదు. ఈ నెల 26న ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర  మొదలవుతుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement